News April 4, 2024
నాగిరెడ్డిపేట్ వైస్ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

నాగిరెడ్డిపేట్ ఇన్‌ఛార్జ్ MPP, వైస్ ఎంపీపీ దివిటి రాజ్ దాస్‌పై BRS పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. MPP ఆఫీస్‌లో RDO ప్రభాకర్ సమక్షంలో గురువారం అవిశ్వాస తీర్మానంపై బలనిరూపణ జరిగింది. 9 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఆయనకు వ్యతిరేఖంగా ఓటు వేశారు.
Similar News
News March 8, 2026
నిజామాబాద్ జిల్లాలో ‘అతివలదే’ అధికారం

NZB జిల్లా ప్రగతి పథానికి మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన జడ్జీగా భరత లక్ష్మీ, DMHOగా డా.రాజశ్రీ, జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా పద్మశ్రీ, RTC RMగా జ్యోత్స్న జిల్లా పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాకుండా పలు శాఖల్లో అధికారులుగా మహిళలు రాణిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
News March 8, 2026
NZB: కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

కేంద్రీ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను భర్తీకి సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర రావు తెలిపారు. నిజామాబాద్, బోధన్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులను నియమించడానికి NZB కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆయన సూచించారు.
News March 8, 2026
NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.


