News August 8, 2024

నాగిరెడ్డిపేట: అనుమతి లేకుండానే పోచారం ప్రాజెక్టు కట్ట తొలగింపు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ కట్టను నేషనల్ హైవే అధికారులు నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే తొలగించారని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నేషనల్ హైవే అలైన్‌మెంట్‌ లేని భూమి వద్ద ఉన్న 100 ఏళ్ల చెట్టును సైతం నరికి వేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఆయన నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు కట్టను తొలగించడం ద్వారా నీటి నిల్వకు తీవ్ర నష్టం అన్నారు.

Similar News

News December 5, 2025

NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

image

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.

News December 5, 2025

నిజామాబాద్: మండలాల వారీగా నామినేషన్ల వివరాలిలా..!

image

ఆలూరు 11 GPల్లో SP-22, WM-113, ARMR 14 GPల్లో SP -51, WM -146, బాల్కొండ 10GPల్లో SP- 29, WM-108, BMGL27 GPల్లో SP-67, WM-224, డొంకేశ్వర్13 GPల్లో SP-36, WM-98, కమ్మర్‌పల్లి 14GPల్లో SP-35, WM-104, మెండోరా 11GPల్లో SP-34, WM-130, మోర్తాడ్-10 GPల్లో SP-23, WM-117, ముప్కాల్ 7GPల్లో SP-32, WM-97, NDPT22 GPల్లో SP-65, WM-276, వేల్పూర్ 18GPల్లో SP-53, WM-179, ఏర్గట్ల 8GPల్లో SP-22, WM-63 నామినేషన్లు.

News December 5, 2025

నిజామాబాద్: 1,543 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 2వ రోజైన గురువారం 1,543 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 294 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 1,249 మంది నామినేషన్లు వేశారు.