News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News December 4, 2025
ఖమ్మం: 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 22.150 కేజీల గంజాయితో పట్టుబడిన రాజస్థాన్‌కు చెందిన భాగ్ చంద్ బైర్వా (A1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
News December 4, 2025
సంగారెడ్డి: 85 పాఠశాల కాంప్లెక్స్‌లకు కంప్యూటర్లు

సంగారెడ్డి జిల్లాలోని 85 పాఠశాల కాంప్లెక్స్‌లకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 85 కంప్యూటర్లను సరఫరా చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా అమలవుతున్న యూ-డైస్, మధ్యాహ్న భోజనం తదితర కీలక వివరాలను నమోదు చేయడానికి ఈ కంప్యూటర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
News December 4, 2025
ASF: పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలన్నారు.


