News April 7, 2024
నాగిరెడ్డిపేట: కుటుంబ కలహలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం బంజర తండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తండాకు చెందిన ధరావత్ వినోద్, అరుణ (32)లకు ముగ్గురు కుమారులున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబీకులు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినకుండా క్షణికావేశంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
News October 20, 2025
మెండోరా: నీటిలో మండుతున్న సూర్యుడు

సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్పై నుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్లుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్లలో ఫొటోలను చిత్రీకరించారు. నీటిలో నుంచి మండుతున్న అగ్నిపైకి వస్తున్నట్లు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది.
News October 19, 2025
NZB: 23 వరకు వైన్స్లకు దరఖాస్తుల స్వీకారం: ES

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.