News May 11, 2024
నాగిరెడ్డిపేట: చెరువులో పడి ఒకరు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ చెరువులో ఉన్న పశువులను బయటకు తీసుకురావడానికి వెళ్లి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
News December 3, 2025
NZB: స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన అబ్జర్వర్

నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) సెల్‌ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. మానిటరింగ్ సెల్‌ను తనిఖీ చేశారు. నిఘా బృందాల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News December 3, 2025
NZB: 1,760 వార్డులకు 3,764 నామినేషన్లు దాఖలు

జిల్లాలో జరగబోయే 2వ విడత GP 1,760 వార్డు మెంబర్ల (WM) పదవులకు 240 నామినేషన్లు రాగ మొత్తం 3,764 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 194 WMలకు 417, డిచ్పల్లి(M) 306 WMలకు 621, ఇందల్ వాయి(M) 198 WMలకు 412, మాక్లూర్ (M) 230 WMలకు 466, మోపాల్ (M) 192 WMలకు 425, NZB రూరల్(M) 172 WMలకు 348, సిరికొండ (M) 264 WMలకు 583, జక్రాన్ పల్లి (M) 204 WMలకు 492 నామినేషన్లు వచ్చాయి.


