News January 22, 2025

నాగిరెడ్డిపేట: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

image

నాగిరెడ్డిపేట మండలం ఎర్రగుంట తండాకు చెందిన మలావత్ రేణుక(38) బుధవారం జప్తి జానకంపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

‘తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయి’

image

నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన BRS కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్, మాజీ MP లింగయ్య యాదవ్ నివాళులు అర్పించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అరాచకాలు పెరిగాయని, తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయని, మల్లయ్య హత్య ప్రజల్లో భయాందోళనలు రేపుతోందన్నారు

News December 10, 2025

ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

image

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.

News December 10, 2025

డ్రై స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్

image

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్‌స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.