News May 11, 2024
నాగిరెడ్డిపేట: చెరువులో పడి ఒకరు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ చెరువులో ఉన్న పశువులను బయటకు తీసుకురావడానికి వెళ్లి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 20, 2025
డ్రంకన్ డ్రైవ్.. ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా

డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన కోటగల్లీకి చెందిన శ్రీనివాస్, ఖిల్లా రోడ్‌కు చెందిన ఎండీ అఖిల్‌కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 15 మందికి రూ. 36,200 జరిమానా విధించినట్లు వివరించారు.
News February 19, 2025
నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

➔NZB: పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➔నిజామాబాద్: ‘నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా’
➔నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్
➔నిజామాబాద్: ఇద్దరి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
➔నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం
News February 19, 2025
నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్

పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో ఈనెల 15న కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా కొంత మంది వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసి ఐదుగురిని కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ వివరించారు.