News February 6, 2025

నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ ఎమ్మెల్యే

image

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద సుదర్శన్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాగేశ్వరరావు కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులు భూక్యా జంపన్న ఉన్నారు.

Similar News

News February 6, 2025

రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..

image

అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.

News February 6, 2025

పాడేరు: పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రణాళికలు

image

పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అరకు చలి ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ, గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

News February 6, 2025

త్వరలో వాట్సాప్‌లోనే బిల్స్ కట్టేయొచ్చు!

image

వాట్సాప్ ద్వారా కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, LPG గ్యాస్, వాటర్ బిల్స్ కట్టే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్‌లతో పనిలేకుండా ఇందులో నుంచే బిల్ పేమెంట్స్ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. కాగా భారత్‌లోని సెలక్టెడ్ యూజర్లకు ఈ యాప్ 2020లో మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సేవలను యూజర్లందరికీ విస్తరించింది.

error: Content is protected !!