News March 17, 2025
నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లు ఇవే..!

నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికలో భాగంగా నిర్ధారించిన మెట్రో స్టేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అల్కాపురి జంక్షన్, కామినేని ఆస్పత్రి, నాగోల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కనెక్టివిటీ జరగనుందని HMRL తెలిపింది.
Similar News
News March 17, 2025
టమాటా తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?

టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయనే సందేహంపై ప్రముఖ వైద్యుడు సుధీర్ క్లారిటీ ఇచ్చారు. ‘టమాటాలు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రభావం లేదు. టమాటాల్లో లైకోపీన్, బీటా కెరోటిన్/ విటమిన్ ఎ & సీ, పొటాషియం, ఫైబర్లు ఉంటాయి. కప్పు టమాటాలు 1 ½ – 2 గ్రాముల ఫైబర్‌తో 27 కేలరీలను కలిగి ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన వ్యక్తి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే టమాటా కెచప్ ఆరోగ్యకరం కాదు’ అని తెలిపారు.
News March 17, 2025
పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయాలి: సిర్పూర్ MLA

పర్యాటక రంగంలో వెనుకబడి ఉన్న ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని సిర్పూర్ MLA హరీశ్ బాబు కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అడవులు, ప్రాజెక్టులు విరివిగా ఉన్న జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని, జిల్లాలో రూరల్ టూరిజం, ఆడ ప్రాజెక్టులో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. వాటితో పాటు హరిత హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
News March 17, 2025
వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్

AP: వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు.