News March 28, 2025
నాగోల్: స్కైవాక్ నిర్మాణాలపై సంస్థల ఆసక్తి..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం కొన్ని సంస్థలు స్థానిక నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు L&T తెలిపింది. మెట్రో నుంచి స్కై వాక్ నిర్మాణాలకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదింపులు జరుగుతున్నాయి.
Similar News
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.
News December 1, 2025
MNCL: నూతన మద్యం పాలసీ అమలు.. అమ్మకాల జోరుకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో 73 వైన్ షాపులకు సోమవారం నుంచి 2025-27 సంవత్సరానికి సంబంధించిన నూతన మద్యం పాలసీ అమలు కానుంది. కొత్త షాపులు రాబోయే 3 నెలల పాటు భారీ అమ్మకాలతో కళకళలాడతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోలాహలం, జనవరి తొలి వారం సెలబ్రేషన్స్తో పాటు జనవరి చివరిలో సమ్మక్క సారలమ్మ జాతర అమ్మకాలు అబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూర్చనున్నాయి.
News December 1, 2025
MBNR: ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు ఇదే!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని మహబూబ్నగర్ వర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.


