News November 28, 2024
నాచారంలో దేశంలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ నేడే ప్రారంభం

పటాన్చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్ మార్ట్-వ్యాల్యుజోన్ ఇప్పుడు నాచారంలో ప్రారంభంకానుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నేడు హైపర్ మార్ట్ను ప్రారంభించనున్నారు. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్వేర్, లగేజ్, ఫర్నిషింగ్ వంటి బ్రాండ్లను ఒకే చోట అందిస్తోంది వాల్యూజోన్. రోజువారీ అవసరాల నుంచి ప్రత్యేక వస్తువుల వరకు వినియోగదారుల కోసం హైపర్ మార్ట్-వ్యాల్యూజోన్ అందుబాటులోకి రానుంది.
Similar News
News November 27, 2025
HYD: మీ చేతిరాత బాగుంటుందా?

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.