News March 28, 2025

నాచారం: కొత్త డిస్పెన్సరీలు ఏర్పడే అవకాశం..!

image

మేడ్చల్ జిల్లా పరిధిలోని నాచారం సహా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ESI ఆసుపత్రికి సంబంధించిన డిస్పెన్సరీలు ఉన్నాయి. ప్రస్తుత అవసరాన్ని గుర్తించిన అధికారుల బృందం మరికొన్ని డిస్పెన్సరీలు అవసరమని ప్రతిపాదనలు ప్రాథమికంగా సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి పంపించి, ఆర్థిక శాఖ నుంచి పూర్తి అనుమతి పొందిన అనంతరం ఏర్పడే అవకాశం ఉంది.

Similar News

News November 26, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత వార్తలు, క్రూడాయిల్ ధరల తగ్గుదల, FIIల కొనుగోళ్ల నేపథ్యంలో ఎగిశాయి. నిఫ్టీ 320.5 పాయింట్లు ఎగసి 26,205 వద్ద, సెన్సెక్స్ 1022.5 పాయింట్ల లాభంతో 85,609 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, INFY, TechM, మారుతీ, HDFC బ్యాంక్ ఎగిశాయి.

News November 26, 2025

నైట్రోజన్ ఛాంబర్‌లో ‘రాజ్యాంగం’.. ఎందుకంటే?

image

భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా ఈ రోజు(nov 26) రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రేమ్ బెహారీ నరైన్ చేతితో రాసిన రాజ్యాంగ ప్రతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పార్లమెంటులో నైట్రోజన్ గ్యాస్ నింపిన గాజు పాత్రలో భద్రంగా ఉంచారు. నైట్రోజన్ వాయువుతో ఆక్సిడేషన్, సూర్యరశ్మి, కాలుష్యం నుంచి అక్షరాలు, ప్రతులకు రక్షణ కలుగుతుంది. గ్లాస్ ఛాంబర్‌లోని గ్యాస్‌ను ఏటా మారుస్తారు.

News November 26, 2025

గడ్డిమందు తాగి మహిళ మృతి: గజపతినగరం ఎస్ఐ

image

గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు.గౌరి మృతిపై కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.