News January 24, 2025

నాటిన మొక్కలను సంరక్షించాలి: నిర్మల్ కలెక్టర్

image

నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డీటీఓ దుర్గాప్రసాద్, ఏఎంవీఐ మర్తుజా అలీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

శ్రీశైలంలో డిసెంబర్-1 నుంచి ఉచిత లడ్డూ కౌంటర్.!

image

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభించటంతోపాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

News November 28, 2025

నెల్లూరు: విలీనం.. ఆదాయానికి గండే..!

image

నెల్లూరు జిల్లాలో మైకా, క్వార్ట్జ్, గ్రావెల్ వంటి ఖనిజ సంపద, అలాగే షార్, నేలపట్టు, వెంకటగిరి చేనేత వస్త్రాలు వంటి పర్యాటక ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. దీని వలన నెల్లూరు జిల్లాకు ఖనిజాలు, పర్యాటకం రూపంలో వచ్చే ఆదాయ వనరులు తరలిపోయాయి. ఇక నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టు, రొట్టెల పండుగ మాత్రమే మిగలడం జిల్లా మనుగడకే సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

News November 28, 2025

ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తాం: ఎస్పీ నరసింహ

image

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసత్య, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, డబ్బు రవాణాపై నిఘా పెంచామని, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.