News March 4, 2025
నాటుసారాను సమూలంగా నిర్మూలించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం-2.0పై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ వెంకట నారాయణమ్మ, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.
News October 24, 2025
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్లు ఉన్నారు.
News October 24, 2025
కర్నూలు: ALL THE BEST సాదియా

పంచలింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోయే 69వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల చెందిన సాదియా తబస్సుమ్ 48 కేజీల వెయిట్ కేటగిరిలో పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మాలిక్ తెలిపారు.


