News April 2, 2025
నాటుసారాపై సమాచారం ఇవ్వండి: అనకాపల్లి కలెక్టర్

నాటుసారా తయారీ అమ్మకాలపై టోల్ ఫ్రీ నెంబర్ 14405కు సమాచారం ఇవ్వాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో నవోదయం 2.0పై సమీక్ష నిర్వహించారు. ఏపీని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News November 20, 2025
రేపు సాయంత్రానికి కోర్టుకు చిన్నఅప్పన్న

తిరుమల కల్తీ నెయ్యి కేసులో CBI సిట్ అధికారులు విచారణ చేస్తున్న ఏ-24 నిందితుడు చిన్ని అప్పన్న కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలలోపు ఆయనకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. గురువారం(ఇవాళ) విచారణలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News November 20, 2025
వరంగల్ కలెక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.
News November 20, 2025
HYD: రాజమౌళిపై PSలో ఫిర్యాదు

HYD రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో మహేశ్ బాబు నటించిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడిపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కె.శివ కుమార్ అన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ PSలో ఫిర్యాదు చేశారు.


