News February 28, 2025
నాటుసారా రహిత జిల్లా కోసం కృషి చేయాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లాను నాటుసారా రహితంగా రూపొందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లో ‘నవోదయం 2.0’ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నాటు సారాపై ప్రజల్లో అవగాహన కలిగించి నాటు సారాను పూర్తిగా నిర్మూలించడానికి ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
Similar News
News July 9, 2025
ఆదిలాబాద్: స్థానిక ఎన్నికలు.. ఆశావహుల్లో TENSION..!

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలఖరులోగా వస్తుందనే ప్రచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆశావహులు పావులు కదుపుతున్నారు. మరోవైపు రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో పోటీ చేయాలని అనుకునే వారిలో టెన్షన్ మొదలైంది. కొంతమంది మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కాగా, గ్రామపంచాయతీల డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన మంగళవారం కలెక్టర్లకు అదేశాలిచ్చారు.
News July 9, 2025
నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News July 9, 2025
YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.