News March 18, 2025
నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

మన రాష్ట్రాన్ని నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. మంగళవారం తిరువూరులో నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సారా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని అన్నారు. చదువులేని వారికి ఎంచుకున్న ఉపాధి తప్పనిసరిగా అందిస్తామని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
News September 18, 2025
పిల్లలు మొబైల్ / టీవీ చూస్తున్నారా?

పిల్లలు అల్లరి చేయగానే ఫోన్, టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారా? ఇది మీ కోసమే. తాజా అధ్యయనం ప్రకారం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా నిద్ర తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, శారీరక శ్రమను ప్రోత్సహిస్తే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.