News March 25, 2025
నాటు సారా నిర్మూలన బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్.

నాటు సారా వలన కలిగే అనర్థాలను ప్రజలలో విస్తృత అవగాహన కల్పించి, నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా *”నవోదయం” -* నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన గోడ పత్రికను, బుక్లెట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
News April 2, 2025
ప.గో: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించాలి..జేసీ

రబీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమీక్షించారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటా ధాన్యంకు సాధారణ రకం రూ.2,300 చొప్పున, గ్రేడ్-ఏ రకానికి రూ.2,320 గా నిర్ణయించడం జరిగిందన్నారు.
News April 1, 2025
ప.గో: రెండు రోజుల్లో 10 టన్నుల చికెన్ అమ్మకాలు

ప.గో జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో జిల్లాలో 10 టన్నులకు పైగా చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.