News March 9, 2025
నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళం: కలెక్టర్

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నవోదయం వెలుగు 2.0 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 గ్రామాలను నాటు సారా ఊరులగా గుర్తించామన్నారు. వీటిని ఏ, బీ, సీ, లుగా విభజించి సారాతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు.
Similar News
News July 11, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు
News July 10, 2025
మెళియాపుట్టి: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు.