News July 21, 2024

నాట్లు వాయిదా వేసుకోండి: వ్యవసాయ అధికారి

image

నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని ప.గో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఉండి మండలంలోని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నారుమడులు దెబ్బతింటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మళ్లీ నారుమడులు వేసుకోవాలని సూచించారు.

Similar News

News October 7, 2024

ఏలూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. 4 పెళ్లిళ్లు.. చివరికి అరెస్ట్

image

మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని పెళ్లిచూపుల పేరుతో ఇప్పటివరకు 4 వివాహాలు చేసుకున్న ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని సోమవారం ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ రెడ్డితో పాటు సహకరించిన తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News October 7, 2024

ప.గో.: నేటి నుంచి ప్రత్యేక రైలు

image

దసరా పండగను పురస్కరించుకుని నేటి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఏలూరు రైల్వే
స్టేషన్ ఇన్‌ఛార్జి రమేశ్ తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు, 7, 8, 9వ తేదీల్లో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి అనపర్తి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పొందూరు మీదుగా శ్రీకాకుళం వరకు నడపనున్నారన్నారు.

News October 7, 2024

జంగారెడ్డిగూడెం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ బాలిక గత నెల 30న ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులోని షారుఖ్ ఖాన్‌పై అనుమానం ఉన్నట్లు తల్లి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు కడపలో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.