News April 19, 2024
నాడు ఒంగోలు కలెక్టర్.. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కే.ఆర్ గురువారం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తనకు ఓటు వేయమని తిరుపతి ప్రజలను కోరారు. విజయ్ కుమార్ 2013 నుంచి 2015 వరకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా, ప్లానింగ్ సెక్రటరీగా సేవలందించారు.
Similar News
News September 7, 2024
కురిచేడు: పలు రైళ్లు రద్దు
గిద్దలూరు- దిగువమెట్ట మధ్య రెండో లైను పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు గుంటూరు- కాచిగూడ (17251), గుంటూరు – డోన్ (17228) ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News September 7, 2024
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ దామోదర్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మత సామరస్యం కొనసాగించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
News September 7, 2024
ఒంగోలులో కొబ్బరికాయలతో 17 అడుగుల గణనాథుడు
ఒంగోలులోని సమతానగర్‌లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా దాదాపు 1500 కొబ్బరికాయలతో 17 అడుగుల ఎత్తులో గణేష్‌ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.