News February 26, 2026

నాడు నల్లకోటుతో కోర్టులో.. నేడు యాచకుడిగా వేములవాడలో!

image

సినిమా కథను తలపించేలా ఓ న్యాయవాది జీవితం తలకిందులైంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్ 2005లో ఎల్.ఎల్.బి పూర్తి చేసి, 2020 వరకు న్యాయవాదిగా రాణించారు. కరోనా కష్టాలతో ప్రాక్టీస్ దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం భార్యతో కలిసి వేములవాడలో యాచకుడిగా జీవనం సాగిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. చదువుకున్న వ్యక్తి ఇలాంటి స్థితికి చేరడం అందరినీ కలచివేస్తోంది.

Similar News

News April 18, 2026

KNR: రెచ్చిపోతున్న కల్తీనూనె మాఫియా

image

ఉమ్మడి KNR(D)లో కల్తీనూనె దందా విస్తృతంగా సాగుతోంది. తక్కువధర సోయాబీన్ నూనెను రసాయనాలతో వాసన మార్చి పల్లి, పొద్దుతిరుగుడు నూనెలుగా విక్రయిస్తున్నారు. 40కిలోల సోయాలో కేవలం 2కిలోల పల్లినూనె కలిపి పూర్తిగా పల్లినూనెగా అమ్ముతున్నారు. KNR, KRTL,JGTL,SRCL,PDPLలోని గోడౌన్లలో టన్నుల నిల్వలతో పలు బ్రాండ్ల పేర్లపై కోట్ల వ్యాపారం జరుగుతోంది. కల్తీ నూనె నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది.

News April 18, 2026

నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

image

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.

News April 18, 2026

B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

image

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.