News June 23, 2024

నాడు పార్వతీపురం ఆర్డీవో.. నేడు విజయనగరం కలెక్టర్..

image

విజయనగరం జిల్లా నూతన కలెక్టర్‌గా బీఆర్ అంబేడ్క‌ర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2015 బ్యాచ్‌కు చెందిన ఈయన కాకినాడ ఆర్డీఓగా, కృష్ణ జిల్లా డీఆర్వోగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జేసీగా, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌గా, ఆప్కో ఎండీగా, పార్వతీపురం ఆర్డీఓగా, ఐటీడీఏ పీఓగా కూడా పని చేశారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా ఉన్నారు.

Similar News

News October 5, 2024

VZM: దసరా ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాలి

image

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఊరేగింపులు, నిమజ్జనాలు శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు.

News October 5, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెట్రోల్ ధర

image

విజయనగరం జిల్లాలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.96గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు కొంతమేర తగ్గింది. గత పది రోజులలో లీటర్ పెట్రోల్ రూ.108.69 – 109.52 మధ్యలో కొనసాగింది. డీజిల్ లీటర్ రూ.96.80గా ఉంది. గత పది రోజులలో దీని రేటు రూ.96.55 నుంచి 97.32 మధ్యలో ఉంటోంది. ఇటు పార్వతీపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.38 కాగా డీజిల్ రూ.98.11గా ఉంది.

News October 5, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.