News November 22, 2024
నాణ్యతతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టండి: నంద్యాల కలెక్టర్
పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు 35 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చొరవ తీసుకోవాలని అన్నారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వచ్చే వారానికి 250 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
Similar News
News November 22, 2024
కర్నూలు పోలీసులకు మంత్రి లోకేశ్ అభినందన
కర్నూలులో ఇద్దరు పిల్లలకు రంగులు వేసి బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నారని మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్పై ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారిని రక్షించింది. దీనిపై తక్షణమే స్పందించిన కర్నూలు పోలీసులను మంత్రి లోకేశ్ అభినందించారు. ‘భవిష్యత్తులో పిల్లలపై ఇలాంటి వేధింపులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ‘X’లో ఆదేశించారు.
News November 22, 2024
రేపు వాలంటీర్లు కలెక్టరేట్ ముట్టడి: డీవైఎఫ్ఐ
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని శనివారం చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్ శుక్రవారంపిలుపునిచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రూ.10,000 జీతం ఇస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
News November 22, 2024
PAC, అంచనాల కమిటీ సభ్యులుగా కర్నూలు జిల్లా MLAలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రజా పద్దుల కమిటీ(PAC) సభ్యునిగా ఎన్నికయ్యారు. అటు అంచనాల కమిటీ సభ్యులుగా ఆళ్లగడ్డ, ఆదోని MLAలు భూమా అఖిలప్రియ, డా.పార్థసారథి ఎన్నికయ్యారు. కాసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీల ఎన్నికలకు కౌంటింగ్ పూర్తికాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గెలుపొందిన సభ్యుల వివరాలను ప్రకటించారు.