News February 6, 2025

నాణ్యమైన కాఫీకి అధిక ధరలు చెల్లించండి: కలెక్టర్

image

నాణ్యమైన కాఫీని సరఫరా చేసిన రైతులకు అధిక ధరలు చెల్లించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏఈవోలు, హర్టీకల్చర్ కన్సల్టెంట్లు, ఫీల్డ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆర్గానిక్ కాఫీ పండిస్తున్న రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించి సేకరించాలన్నారు. గిరిజన రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలను చెల్లించాలని ఆదేశించారు.

Similar News

News January 22, 2026

ఎన్‌కౌంటర్‌లో 15కు చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య

image

ఝార్ఖండ్ <<18923190>>ఎన్‌కౌంటర్<<>> ఘటనలో మావోయిస్టు మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ ఉన్నారు. ఆయనపై రూ.5 కోట్ల రివార్డు ఉండడం గమనార్హం. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

News January 22, 2026

ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్.. రూ.5వేల కోట్ల పెట్టుబడి

image

తెలంగాణను AI డేటా సెంటర్​ హబ్​గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. దావోస్​లో యూపీసీ వోల్ట్ సంస్థతో CM రేవంత్ బృందం MOU కుదుర్చుకుంది. ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100MW సామర్థ్యంతో AI డేటా సెంటర్‌‌ను నెలకొల్పనుంది. ఐదేళ్లలో ₹5,000Cr పెట్టుబడి పెట్టనుంది. 100MW సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

News January 22, 2026

తిరుపతి ఐజర్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IISERలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, నర్స్, సెక్యూరిటీ, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్‌ తదితర 12 విభాగాల్లో మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 02. అర్హత ఇతర వివరాలకు www.iisertirupati.ac.in చూడాలి.