News February 25, 2025
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డేటా కీలకం: సీఎండీ

హనుమకొండలోని NPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వివిధ జిల్లాలకు సంబంధించిన DE, ADE, AE MRT విభాగానికి చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నుంచి రియల్ టైం డేటా ఎప్పటికప్పుడు పొందడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి డేటా కీలకమని సూచించారు.
Similar News
News March 25, 2025
క్రికెటర్ తమీమ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లతో మాట్లాడుతున్నారు. తమీమ్‌కు గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు దాదాపు 22 నిమిషాలపాటు CPR చేశారు. అనంతరం మూడుసార్లు DC షాక్ ఇచ్చారు. వెంటనే స్టెంట్లు అమర్చారు. దీంతో తమీమ్ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా నిన్న ఓ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
News March 25, 2025
Stock Markets: 800 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్లు మరోసారి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయుల నుంచి కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 78,741 నుంచి మధ్యాహ్నం 800PTS మేర కుంగి 77,912 వద్ద కనిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం 78,023 (47) వద్ద చలిస్తోంది. నిఫ్టీ 23,869 నుంచి 23,627కు పడిపోయింది. 23,687 (30) వద్ద ట్రేడవుతోంది. సూచీకి 23800 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ట్రంప్ టారిఫ్స్‌తో నెగటివ్ సెంటిమెంటు పెరిగింది.
News March 25, 2025
కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను పదో తరగతి విద్యార్థి మహేశ్ కిరాతకంగా <<15871409>>కొట్టిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పదో తరగతి విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.