News March 14, 2025
నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 15, 2025
కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్నగర్లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
మంత్రి ఉత్తమ్తో తుమ్మల భేటీ..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై సమావేశమయ్యారు. తుమ్మల మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేయాలని భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, 4వ పంపు హౌస్ నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, సమయపాలనపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.
News March 15, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఒంటిపూట బడులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 118 పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.