News March 14, 2025
నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 22, 2025
శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
News April 22, 2025
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 22, 2025
కామారెడ్డి: NH-44పై యాక్సిడెంట్

బిక్కనూర్ శివారులోని NH-44పై ప్రమాదం జరిగింది. టాటాఏస్ బోల్తా పడి13 మందికి గాయాలయ్యాయి. గద్వాల జిల్లాకు చెందిన కొందరు బాసరలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో వారి వాహనం బిక్కనూర్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయపడ్డవారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.