News June 23, 2024
నాదెండ్ల మనోహర్‌ను కలిసిన మాజీ ఎంపీ జయదేవ్

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదివారం గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనోహర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
పోలీస్ సిబ్బంది వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత: SP

SP వకుల్ జిందాల్ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నుంచి నేరుగా వినతులను స్వీకరించిన SP, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాఖాపరమైన కేసుల్లో విచారణ అనంతరం సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ, సిబ్బందికి అనువైన వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News December 12, 2025
విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం కృషి చేయాలి: DEO

విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు DEO సలీం బాషా సూచించారు. స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మీ పుల్లయ్య ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) పురోగతిని DEO పరిశీలించి, విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. కార్యక్రమంలో MEO ఖుద్దూస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News December 12, 2025
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలి: విజయానంద్

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. పెన్షన్లు, రేషన్ పంపిణీ, వైద్య సేవలు, ధాన్యం సేకరణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు పనిచేయాలని చెప్పారు. లబ్ధిదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ అశితోష్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు.


