News September 11, 2024
నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య వి. రవి కుమార్ తెలిపారు. 3వ విడత వెబ్ ఆప్షన్లు, రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ/బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని ఆయన తెలిపారు.
Similar News
News October 20, 2025
స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు

కోన ప్రభాకరరావు 1916, జులై 10న బాపట్లలో జన్మించారు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసి మద్రాసులో పట్టభద్రుడయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు.1967, 1972, 1978 శాసనసభకు ఎన్నికయ్యారు.1980-81 వరకు శాసనసభ సభాపతిగా పనిచేశారు.1983 సెప్టెంబరు 2న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యారు.
అక్టోబరు 20 1990న హైదరాబాదులో మరణించారు.
News October 20, 2025
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం: అంబటి

వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంతో పేదలకు ఎంతగానో నష్టం చేకూరుతుందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆదివారం పెదకాకానిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ప్రజలందరూ పీపీపీ విధానాన్ని ఖండించాలని చెప్పారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలన్నారు.
News October 19, 2025
యాప్ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.