News November 21, 2024

నాపై కేసు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు: మాజీ MLA గోపిరెడ్డి

image

నరసరావుపేట మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. భూ వివాదంలో డబ్బులివ్వకపోతే తనను చంపుతానని బెరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన గోపిరెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదని, తనపై కేసు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదన్నారు. ఎటువంటి సంబంధం లేని అంశంలో చంపుతామని బెదిరించాడని కేసు పెట్టడం దారుణమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు.

Similar News

News December 26, 2024

గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.

News December 26, 2024

కొల్లూరు: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్

image

పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 26, 2024

కొల్లూరు: ట్రాక్టర్ కొనివ్వలేదని సూసైడ్

image

ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లూరు మండలం సగ్గునలంకలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సగ్గునలంకకు చెందిన మణికంఠ ట్రాక్టర్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వారు ఒప్పుకోకపోవడంతో 20వ తేదీన మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.