News September 14, 2024
నాపై విష ప్రచారం చేసిన మీడియా సంస్థకు నోటీసులు: పెద్దిరెడ్డి

తనపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు పంపినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఓ న్యూస్ ఛానల్కు పరువునష్టం కింద రూ.50 కోట్లకు న్యాయవాదులు నోటీసులు పంపారని తెలిపారు. నిరాధారంగా వార్తలు రాసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయ పరంగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News October 26, 2025
చిత్తూరు: వైద్య సిబ్బందికి సెలవులు లేవు

భారీ వర్ష సూచనల నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు లేవని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. ఆదివారం జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సోమ, మంగళ వారాల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
News October 25, 2025
చిత్తూరు: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు.!

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
News October 25, 2025
కోడి తెచ్చిన తంటా.. ఎనిమిది మందిపై కేసులు

కోడి తెచ్చిన తంటా.. పుంగనూరులో ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. SI రమణ వివరాల మేరకు.. పట్టణంలోని రహ్మత్ నగర్లో పక్కపక్కనే భాస్కర్ నాయుడు, ఖాదర్ వలీ కుటుంబాలు ఉంటున్నాయి. భాస్కర్కు చెందిన కోడి ఖాదర్ వలీ ఇంటి వద్ద ఇది వరకు రెట్ట వేయడంతో గొడవ పడ్డారు. శుక్రవారం మరోసారి ఇదే రిపీట్ కావడంతో ఇరుకుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు SI తెలిపారు.


