News April 18, 2024

నామినేషన్లకు అంతా సిద్ధం: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి కాగా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.

Similar News

News September 11, 2024

నెల్లూరు జిల్లాలో కొండెక్కిన ఉల్లి ధర

image

నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.

News September 11, 2024

పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

News September 10, 2024

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త

image

నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.