News April 25, 2024
నామినేషన్ దాఖలు చేసిన పోట్ల నాగేశ్వరరావు

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బుధవారం పోట్ల నాగేశ్వరరావు రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతంకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, కొత్తగూడెం యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2026
విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News March 7, 2026
ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.
News March 7, 2026
అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.


