News April 25, 2024
నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి

మెదక్ బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు నగేష్ తో కలసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Similar News
News December 22, 2025
మెదక్: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలని, అధికారులు సమయ పాలనా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తప్పని సరిగా సమయ పాలనా పాటించాలన్నారు. కార్యాలయాలలో తప్పకుండా హాజరును నమోదు చేయాలన్నారు.
News December 22, 2025
మెదక్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News December 22, 2025
మెదక్: నేడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు జరగక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. సుమారు రూ.50 కోట్లకుపైగా నిధులు రానుండటంతో పల్లె పాలన మళ్లీ గాడిలో పడనుంది.


