News April 25, 2024
నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే
టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
Similar News
News January 19, 2025
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని పేషంట్ మృతి
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని బెవర జోగినాయుడు అనే పేషంట్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన ఈయన పాంక్రియాటైటిస్‌తో బాధపడతూ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఏం జరిగిందో ఏమో గాని ఆదివారం మేల్ వార్డు బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. మృతునికి భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 19, 2025
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట జంక్షన్ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిరమండలం కొండరాగోలుకు చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) అనే యువకుడు మృతి చెందినట్లు సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపారు. ఆమదాలవలసలోని స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
News January 19, 2025
శ్రీకాకుళం జిల్లాలో పెరిగిన చలితీవ్రత
శ్రీకాకుళం జిల్లాలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో పాటు మంచు అధికంగా కురుస్తుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా చలికి వణుకుతున్నారు. జిల్లాలోని టెక్కలి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, గార మండలాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి, వేకువజాము సమయాల్లో చలిమంటలు వేస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.