News April 24, 2024

నామినేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దువ్వాడ వాణి

image

టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందుగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు వాణితో సంప్రదింపులు జరిపారు. దీంతో నామినేషన్ వేసే నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Similar News

News November 25, 2024

సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం

image

సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News November 25, 2024

SKLM: అయ్యప్పస్వామి భక్తులకు ప్రత్యేక రైలు

image

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి నేరుగా శబరిమల (కొల్లం) వరకు ప్రత్యేక రైలును డిసెంబరు 1 నుంచి జనవరి 19 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని, రైలు ప్రారంభించడంపై సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ సురక్షితంగా, శుభప్రదమైన యాత్ర జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

News November 25, 2024

శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్

image

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.