News April 18, 2024
నామ పత్రాల సమర్పణకు సర్వం సిద్ధం!

ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL లోక్సభ పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 21న ఆదివారం సెలవు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 3 గం. వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అభ్యర్థి వెంట ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్లాలి. నామపత్రాలు సమర్పించే అభ్యర్థులు రూ.25 వేలు,SC,ST అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది.
Similar News
News November 15, 2025
పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 15, 2025
MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

మహబూబ్నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News November 15, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


