News April 2, 2024
నాయుడుపేటలో ఇద్దరు కత్తులతో దాడి

నాయుడుపేట బీడీ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తిపై మస్కుద్, మౌళి అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రసాద్‌ను గొంతుపై కత్తితో కోయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి వచ్చేసరికి మస్కుద్, మౌళి పరారయ్యారు. గాయపడిన ప్రసాద్‌ను నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.
News February 27, 2026
తిరుమలలో కొత్త విధానం..!

తిరుమలలో భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హుండీలో వేయవచ్చు. దీనిపై TTD బోర్డు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పత్రానికి సంబంధించి ఓ నమూనాను పై ఫొటోలో చూడవచ్చు.
News February 27, 2026
మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


