News March 28, 2025

నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. ఐదేళ్లు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో వెంకయ్య అనే వ్యక్తికి నాయుడుపేట కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.22,000 జరిమానా విధించింది‌. నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక ఆడుకుంటుండగా 2019లో వెంకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదే రోజు వెంకయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పొక్సో కోర్టు న్యాయమూర్తి సుమ నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష ఖరారు చేశారు.

Similar News

News November 19, 2025

డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

image

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

News November 19, 2025

గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్‌కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News November 19, 2025

నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.