News May 20, 2024

నాయుడుపేటలో రైలు ఢీకొని ఒకరు మృతి

image

నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న రైలు… పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 23, 2026

నెల్లూరు: పరిశ్రమకు భూమి కేటాయింపు

image

ఉదయగిరి మండలం చెర్లోపల్లి–వడ్డీపాలెం గ్రామాల సమీపంలో బయోగ్యాస్(CBG) ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నం.251లో సుమారు 200 ఎకరాల భూమిని ప్లాంట్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. జనావాసాల దగ్గర ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన, కాలుష్యం, ప్రమాదాల భయం పెరుగుతుందని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News February 23, 2026

NLR: ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు సిటీ DKW కళాశాలలో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.

News February 23, 2026

నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

image

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.