News December 5, 2024
నాయుడుపేటలో సినీ నటుడు సత్య ప్రకాశ్ పూజలు

నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఉమామహేశ్వర దేవాలయాలను గురువారం ప్రముఖ సినీ నటుడు సత్య ప్రకాశ్ దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ దేవాలయాల సందర్శన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల, శ్రీశైలం క్షేత్రంను దర్శించుకున్నట్లు ఉందని సత్య ప్రకాశ్ అన్నారు.
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు కన్నీటిని మిగిల్చిన పునర్విభజన

పెంచలకోన, శ్రీహరికోట, ఫ్లెమింగో ఫెస్టివల్..జిల్లా శిగలో మణిహారాలు. వీటితో నిత్యం <<18390784>>జిల్లా<<>> పర్యాటకులతో సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత కథ మారింది. <<18390350>>3 నియోజకవర్గాలను<<>> తిరుపతిలో కలపడంతో చెంగాలమ్మ టెంపుల్, శ్రీసిటి, వెంకటగిరి జాతర, దుగ్గరాజపట్నం పోర్ట్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలు వెళ్లిపోయాయని రొట్టెలపండుగ తప్ప <<18391147>>ఇంకేమీ<<>> మిగిలిదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
నెల్లూరు: ఫ్రీగా స్కూటీలు.. 30న లాస్ట్.!

దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. 10పాసై, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఇందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది అప్లై చేసుకున్నట్లు ఏడీ ఆయుబ్ తెలిపారు. అర్హులు APDASCELC.AP.GOVలో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు కోరారు.
News November 27, 2025
ఉదయగిరి: విద్యార్థిని చితకబాదిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు

ఉదయగిరి బాలాజీ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో విద్యార్థిపై నిర్వాహకుడు అంజయ్య వాతలు పడేలా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఆరో తరగతి నవోదయ ప్రవేశానికి ముందస్తుగా ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. అనంతరం వారు విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు.


