News August 20, 2024

నాయుడుపేటలో 22న ఇంద్ర సినిమా రీ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంద్ర సినిమాను ఈనెల 22న నాయుడుపేటలోని సీఎస్ తేజా థియేటర్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 8గంటలకు సినిమా ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సినిమాకి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడదల చేసి ఉన్నారు. 2002 జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. మరోసారి సినిమా‌ రిలిజ్ కాబోతుండడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 8, 2024

కావలి: మత్తులో వ్యక్తి వీరంగం

image

కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

News September 8, 2024

గూడూరు వైసీపీ నేతకు షాక్..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

News September 8, 2024

గూడూరులో భారీగా గంజాయి స్వాధీనం 

image

గూడూరు బైపాస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.