News November 29, 2024

నాయుడుపేట: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

నాయుడుపేట గొట్టిప్రోలు ప్రాథమిక వైద్యశాలలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బల్లి ప్రభాకర్(51) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రభాకర్ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన ఓజిలికి తరలించారు. ప్రభాకర్ మృతి పట్ల సహ ఉద్యోగులు, మిత్రులు శ్రేయోభిలాషులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News January 23, 2026

ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 25, 27న పరీక్షలు: DEO

image

గూడూరులోని SPS UP స్కూల్లో ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 25, 27వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి తమ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు తిరుపతిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News January 23, 2026

నెల్లూరు GGHలో శవాలను తినే రాబందులు!

image

నెల్లూరు GGHలో కొందరు డాక్టర్లు శవాలపై సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఓ SIని సైతం లంచం డిమాండ్ చేయడం విస్తుపోయేలా చేస్తోంది. కొత్తవంగల్లులో 3ఏళ్ల క్రితం సుశీలమ్మ మరణించింది. ఇటీవల హత్య అని తేలడంతో SI రీపోస్టుమార్టం కోసం GGHకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశారట. ఆయన దీనిపై ఫిర్యాదు చేసినట్లు అధికారులకు తెలుస్తోంది.

News January 23, 2026

నెల్లూరు: జవాన్‌పై దాడి.. ఇరు వర్గాలపై కేసు

image

BSF జవాన్ జోడు వెంకటప్రసాద్‌పై దాడి కేసులో పరస్పర ఫిర్యాదులు అందడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీతారాంపురం ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఒడిశాలో పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాతకక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానికులు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు.