News February 17, 2025
నాయుడుపేట రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. చెన్నై వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పక్కన ఈ మృతదేహం పడి ఉన్నట్టు గుర్తించారు. మృతుడి కుడి చేయి తెగినట్లు తెలుస్తోంది. ట్రైన్‌లో నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్టు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 21, 2025
తాడేపల్లిగూడెం: మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

పెదతాడేపల్లి సమీపంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపూడి పెద్దిరాజు మృతి చెందారు. వెల్లమిల్లిలో పని ముగించుకుని కొమ్ముగూడెం వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ వీరి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దిరాజు గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూయగా, మోపెడ్ నడుపుతున్న చెల్లయ్య తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 21, 2025
2,322 ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2,322 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 23న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పని అనుభవం కలిగిని వారికి వెయిటేజీ పాయింట్లను కలిపి మెరిట్ రూపొందించినట్లు పేర్కొన్నాయి.
News December 21, 2025
కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, చికెన్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్, మటన్ గత వారం ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయి.


