News March 16, 2025

నారపల్లి: పాత నాణేల మాయ.. మోసపోయిన మహిళ

image

పాత నాణేలు విక్రయిస్తే రూ.లక్షలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను నట్టేట ముంచారు. పోలీసుల ప్రకారం.. పాత నాణేలు విక్రయిస్తే రూ.46 లక్షలు వస్తాయని ఓ మహిళను నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజ్, ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఆమె నుంచి ₹1.36 లక్షలు లూటీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసపూరిత ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News March 17, 2025

సీఎంని తిట్టడం అప్రజాస్వామికం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

image

HYD: ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్‌ గిల్డ్స్‌ ఎలా ఖండిస్తుందని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టిన కంటెంట్‌ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డిలున్నారు.

News March 17, 2025

ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

image

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.

News March 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్

error: Content is protected !!