News February 4, 2025
నారాయణఖేడ్: ఇరు వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు
నారాయణఖేడ్ మండలం బానాపూర్లో జరిగిన ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం.. బాణాపురం గ్రామస్థులు, పక్కనే ఉన్న బుడగ జంగాల కాలనీకి చెందిన కొందరు 4 రోజుల క్రితం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాకి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.
Similar News
News February 4, 2025
నేషన్ బిల్డర్స్ అయిన ట్యాక్స్ పేయర్స్ అంటే మోదీకి గౌరవం: నిర్మల
దేశ నిర్మాతలైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నమే బడ్జెట్లో కల్పించిన రిలీఫ్ అని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాలుగేళ్లుగా వారితో నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను బట్టే చర్యలు తీసుకున్నామని వివరించారు. పాత పన్ను విధానం రద్దు చేయాలనుకోవడం లేదని, మినహాయింపులు కోరుకొనేవారు ఉపయోగించుకోవచ్చని సూచించారు.
News February 4, 2025
మహిళను బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్
నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన మహిళను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రూ.కోటి 81 లక్షల విలువ గల స్థిర, చర ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు.
News February 4, 2025
WGL: తీవ్ర విషాదం.. అన్న మృతి తట్టుకోలేక తమ్ముడు మృతి
వరంగల్ నగరంలో తీవ్రవిషాదం నెలకొంది. అన్న మృతి తట్టుకోలేక తమ్ముడు సైతం మృతి చెందిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. శివనగర్కు చెందిన శంకర్ సింగ్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. కాశిబుగ్గకు చెందిన తమ్ముడు రతన్ సింగ్ ఈరోజు ఉదయం అన్న మృతదేహం చూసి, ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉదయం తమ్ముడు సైతం మరణించారు. ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది.