News February 13, 2025
నారాయణఖేడ్: గుండెపోటుతో గృహిణి మృతి

గుండెపోటుతో గృహిణి మృతి చెందిన ఘటన నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోష్కే లక్ష్మి (31) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈమె మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 13, 2025
ఇన్స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
News March 13, 2025
బొమ్మలరామారంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎల్లో అలర్ట్ జారీ

యాదాద్రి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు పెరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.