News April 4, 2025

నారాయణపురం మండలంలో అత్యధిక వర్షపాతం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం సాయంత్రం నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా నారాయణపురం మండలంలో 97.8 MM, అత్యల్పంగా ఆలేరు మండలం గొలనుకొండలో 1.3MM నమోదైంది. తుర్కపల్లి 82.5MM, చౌటుప్పల్ 50.5 MM, బీబీనగర్ 48.5MM, ఆత్మకూర్ 44.5MM, గుండాల 37.5MM, పోచంపల్లి 30.0MM, మోత్కూర్ 13.5MM, రాజాపేట 13.3MM, భువనగిరి 9.0MM వర్షపాతం నమోదైంది.

Similar News

News October 27, 2025

కొత్తపల్లి: మతిస్థిమితం లేకే తల్లిని చంపిన కుమారుడు: పోలీసులు

image

కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌లో తల్లి భీమమ్మను హత్య చేసిన కుమారుడు రామకృష్ణకు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక అతను గ్రామంలో తిరుగుతున్నాడని సీఐ సైదులు, ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిని పార, బండరాయితో మోది చంపినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 27, 2025

బాదం నూనెతో ఎన్నో లాభాలు

image

బాదం నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. బాదం, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని మాడుకు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే తరచూ బాదం నూనెతో మసాజ్ చేస్తే డార్క్​ సర్కిల్స్, ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు తగ్గి తేమ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#skincare<<>>

News October 27, 2025

వద్దన్నా.. బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు

image

AP: సరైన ధర, కొనుగోలు లేనందున బర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాల్లో, కర్నూలులో 4 వేలు, పల్నాడు జిల్లాలో 4,600 ఎకరాల్లో.. మరో 7 జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో బర్లీ పొగాకును సాగు చేస్తున్నట్లు వెల్లడైంది. రైతులు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో అధికారులకు కూడా తెలియదు.