News January 11, 2026

నారాయణపురం: 57 ఏళ్లు.. 18 పట్టాలు

image

మండలానికి చెందిన ఇమ్మడి నాగేష్ అక్షరాలతోనే సహవాసం చేస్తూ అనేక కోర్సుల్లో 18 పట్టాలు సాధించారు. సొంత ఊర్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన నాగేష్ ఇటీవల 57 ఏళ్ల వయసులో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి యోగాలో డిప్లొమా కోర్సు చేసి పట్టా స్వీకరించారు. తన ఊరిలో ‘గ్రామ శ్రీ’ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య శిబిరాలతో పాటు విద్యార్థులకు తీర్థ వికాస శిక్షణాసేవా వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News January 21, 2026

జగిత్యాల: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి సీతక్క

image

జగిత్యాల జిల్లాలో నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నూతన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, సుపరిపాలనతో వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచులు ప్రజల అవసరాలను గుర్తించి, కేంద్ర, రాష్ట్ర నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన పాలనతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 21, 2026

MNCL: ‘శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు’

image

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 శాంతియుతంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా 163BNSS ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, లెక్కింపు వంటి కీలక కార్యమాల సమయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.